విద్యుత్ లోఓల్టేజీతో నానా పాట్లు..
Ens Balu
3
Annavaram
2021-05-14 07:18:37
అన్నవరంలో విద్యుత్ సరఫరా లోఓల్టేజీ సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది..కర్ఫ్యూ కావడంతో ప్రజలంతా ఇంటికే పరిమితం అవుతున్న తరుణంలో కరెంటు ఉన్నా ఉపయోగం కనిపించడం లేదు. కనీసం ఫ్యాన్లు కూడా స్పీడుగా తిరిగే అవకాశం లేకుండా పోతుంది. చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికి ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు ఆన్ అవడం లేదు. ఇన్వైటర్ మీద పనిచేసుకుందామంటే విపరీతమై విద్యుత్ కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇన్వైటర్ బ్యాటరీలు కూడా చార్జింగ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రాత్రి సమయంలో అప్రకటితంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఓల్టేజీ రావడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాత్రిలు లోఓల్డేజీ సమస్యతో చదువుకోవడానికి కూడా వీలులేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.