మానవతా దృక్పదంతో సేవ చేయాలి..


Ens Balu
5
Visakhapatnam
2021-05-15 15:55:16

కరోనా వైరస్ అధికంగా వున్న సమయంలో అధికారులు, సిబ్బంది మానవతా దృక్పదంతో  సేవలందించాలని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) చూసించారు. శనివారం విశాఖలోని  విమ్స్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పర్యాటక శాఖమంత్రి, మేయర్ వెంకట హరి కుమారిలతో  కలిసి పరిశీలించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే పేషెంట్లతో ఆప్యాయతతో మాట్లాడి సమస్య తెలుసుకొని, ఆక్సిజన్ ఉన్న పడకలు కావాలా, వెంటిలేటర్, ICU పడకలు కావాలో తెలుసుకొని కేటాయించాలన్నారు. ఆక్సిజన్ పడకలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ICU పడకలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. పేషెంటు యొక్క సమాచారంను వైద్యుల ద్వారా తెలుసుకొని బందువులకు  తెలియజేయాలన్నారు.  మన ఇంటి వారికి ఏ విధముగా  అయితే చేస్తామో ఆలాగే చేసి మానవతా దృక్పథంతో ఉండాలని తెలిపారు. హెల్ప్ డెస్క్ లో  ఎంత మంది సిబ్బంది ఉంటున్నారు, ఎన్ని సిప్టులుగా ఉంటున్నారని, తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.  ఒక రోజులో ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి, పడకల వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.  ఈ సందర్శనలో జెసిలు వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఇపిడిసియల్ సిఎండి నాగలక్ష్మి, సంచాలకులు రాంబాబు, తదితరులు ఉన్నారు.

సిఫార్సు