చిన్నారులకు సమిథ మాస్కులు వితరణ..


Ens Balu
4
Ravikamatham
2021-05-16 04:21:59

కరోనా వైరస్ కేసులు ఎక్కువతున్న తరుణంలో చిన్నారులను ఆ వైరస్ నుంచి కాపాడేందుకు యలమంచిలికి చెందిన సమిథ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఆదివారం రావికమతం మండలంలోని చీమలపాడు, ములకల పల్లి, జోగుంపేట, కుంజర్తి గ్రామాల్లో ఆశ కిరణ్ ప్రత్యేక పాఠశాలలో చదువుతున్న  చిన్నారులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులకు మాస్కులు ముక్కూ, నోరు మూసుకుంటూ ఎలా ధరించాలి, శానిటైజర్లను ఎలా వినియోగించాలి, చేతులు ప్రతినిత్యం సబ్బుతో ఎలా శుభ్రం చేసుకోవాలనే విషయాలను సంస్థ కార్యదర్శి వీరభద్రరావు అవగాహన కల్పించారు. అంతేకాకుండా చిన్నారుల తల్లిదండ్రులకు కూడా కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. రోటరీ ఇండియా లిటరీ మిషన్ సహకారంతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో స్థానిక ఆలయ కమిటీ చైర్మన్ దాడి పోతురాజు, సంస్థ అధ్యక్షులు పడాల రమణ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గోపీ వరప్రసాద్, ఆశాకిరణం కేంద్రం ఉపాధ్యాయులు కళ్యాణ్, పవన్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
సిఫార్సు