అనాధ పిల్లల కోసం ప్రత్యేక పునరావాసం..
Ens Balu
5
Sankhavaram
2021-05-16 07:06:57
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు కోవిడ్ కేర్ లో చికిత్సపొందే సమయంలో అనాధలైన పిల్లల కోసం, ప్రభుత్వం ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు శంఖవరం సిడిపిఓ ఊర్మిల తెలియజేశారు. ఆదివారం ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ కారణంగా అనాధలైన పిల్లల సమాచారం అందించేందుకు చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లు 181, 1098 పనిచేస్తున్నాయన్నారు. అలాంటి సమాచారం చైల్డ్ లైన్ నిర్వాహకులు వచ్చే సమయంలోవారికి గ్రామ, వార్డు మహిళా సంరక్షణా కార్యదర్శిలు సహాయం అందించాలని కూడా తెలియజేశారు. అంతేకాకుండా అంగన్ వాడీలు, ఆశ కార్యకర్తల ద్వారా ఇలాంటి అనాధ పిల్లల సమాచారం ఉంటే తెలియజేయాలని కూడా ఆ ప్రకటనలో సూచించారు. ఇందుకోసం జిల్లాలో డైరెక్టర్ జువెనైల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో బాల బాలికల కొరకు వేరువేరుగా రెండు బాలల సంరక్షణ కేంద్రాలను గుర్తించినట్లు తెలియజేసారు. అలాగే ఇలాంటి పిల్లల గురించి సమాచారం ఇచ్చేందుకు 181 మరియు 1098 (చైల్డ్ లైన్ )అనే టోల్ ప్రీ నెంబర్లు పని చేస్తున్నాయి అని తెలిపారు. మరింత సమాచారం కోసం జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ వెంకటరావు 9441819904, 8555060818లోనైనా సంప్రదించవచ్చునన్నారు. అంతేకాకుండా కరోనాతో తల్లిదండ్రులు మ్రుత్యువాత పడినా తక్షణమే సమాచారం అందిస్తే చైల్డ్ లైన్ నిర్వాహకు ద్వారా వారిని పునరావాస కేంద్రాలకు తీసుకెళతారని వివరించారు. అంతేకాకుండా కోవిడ్ ను ఆసరాగా చేసుకొని బాల్య వివాహాలును గ్రామాల్లో చేసే వారిపై & వాటిని ప్రోత్సహించే వారిపై కఠిన శిక్షలు విదిస్తారని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. ఈమేరకు శంఖవరం ప్రాజెక్టు పరిధిలోని అందరు అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఆదేశాలు జారీచేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.