విశాఖ మన్యంలో బయో మండలాలు విస్తరణ జరగాలి..


Ens Balu
3
Gonduru
2020-08-27 20:01:05

విశాఖ ఏజెన్సీలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామాలను విస్తరించి, బయో మండలాలుగా ప్రకటించే విధంగా కోవేల్ ఫౌండేషన్ కృషి చేయాలని ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి కోరారు. గురువారం డి.గొందూరు క్లస్టర్ లో ప్రకటించిన కరకపుట్టు, గుర్రంపనుకు గ్రామాల్లోని రైతులు సాగుచేసిన ఐదంచెల విధానంలోని పంటలు, శ్రీ వరి, కిచెన్ గార్డెన్స్, న్యూట్రీ గార్డెన్స్ ను ఆమె గురువారం పరిశీలించారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న రసాయన విధానం ద్వారా రైతులు పంటలను సాగు చేయడం వల్ల ఆహార ఉత్పత్తులు కలుషితం అవడమే కాకుండా భూమి సారవంతం కోల్పోయి, ఆపై అవి తినే మానవాళిపై  తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కోవెల్ ఫౌండేషన్ సీఈఓ కృష్ణారావు, ఎమ్మెల్యేతో కలిసి, ఫౌండేషన్ లు సమకూర్చిన  77 వీడర్లు, 450 మంది రైతులకు ఎల్లో ప్లేట్స్, దీపపు ఎర్రలు, సుమారు 700 మంది రైతులకు రెండు కిలోల బెల్లం, రెండు కిలోల సెనగపిండి చొప్పున ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పంపిణీ చేశారు.