ఫీవర్ సర్వే పారదర్శకంగా చేపట్టాలి..


Ens Balu
4
Sankhavaram
2021-05-17 15:38:04

 గ్రామాల్లోని ఇంటింటా ప్రతి ఒక్కరికీ నిర్వహించే జ్వర పీడితుల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని శంఖవరం  తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఈ మేరకు వీఆర్వోలు, ఇతర రెవెన్యూ సిబ్బందికి సర్వేపై మార్గనిర్దేశం చేసారు. ఈ సందర్భంగా తహశీల్దార్  మాట్లాడుతూ సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏడో విడత ఫీవర్ సర్వే జరుగుతుందన్నారు. ఆ విధంగా మే నెలాఖరు వరకు 11 విడతలుగా సర్వే చేయాల్సి ఉంటుందని సిబ్బందికి వివరించారు.  ఈ సర్వేలో పంచాయతీ కార్యదర్శులు, వి ఆర్ ఓ లు, సచివాలయ సిబ్బంది, ఎఎన్ఎమ్ లు, ఆశా కార్యకర్తలు, సచివాలయాల వలంటీర్లు మమేకమై ప్రతీ గృహాన్ని సందర్శించి సభ్యులు వారీగా సర్వే చేయాలన్నారు.  జ్వరం, దగ్గు‌‌, రొంప, అయాసం వంటి ప్రాధమిక లక్షణాలును గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ ల ద్వారా అంతర్జాలంలో నమోదు చేయాలని  ఆదేశించారు. ఈ సర్వేలో రోగాలని తేలిన వారికి అవసరమైన మందులను నేరుగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి తీసుకుని వచ్చి బాధితులకు ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు. కత్తిపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసామని, ఇప్పటికే మండల వ్యాప్తంగా కరోనా సోకిన వ్యక్తులకు ఇంటి వద్ద నివశించడానికి అనుకూలమైన ప్రదేశం లేని వారికీ ఈ కేంద్రాన్ని సూచించాలని తాహసిల్దార్ ఆదేశించారు. ఇది కేవలం ఉండడానికి మాత్రమే ఉపకరిస్తుందని, ఆహారం, ఇతరత్రా సామాగ్రి కరోనా బాధితులే సమకూర్చు కోవాలని తెలపాలని ఆదేశించారు. ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోనేలా చూడాలన్నారు. కొన్ని గ్రామాల్లో రేషన్ ఇవ్వడం పూర్తి కాలేదని త్వరితగతిన పూర్తి చెయ్యాలని తాహసిల్దార్  సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ తేజస్విని, విఆర్ఓలు సితారామ్, నరేష్, శ్రీనివాస్, శ్రీరాములు, షేక్ బాబ్జీ, దేవసహాయం, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, లోవరాజు, సత్యనారాయణ, వీరలక్ష్మీ పాల్గొన్నారు.
సిఫార్సు