ఒంటరి మహిళకు యువ సర్వేయర్లు ఆపన్నహస్తం..
Ens Balu
8
Sankhavaram
2021-05-18 10:30:30
కరోనా సమయంలో ఒంటరిగా ఉంటూ అంగవైకల్యంతో వున్నతన చిన్నకూతురి పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న ఒక కుటుంబానికి చేయూతనందించడానికి యువసర్వేయర్లు కె.సత్య(వేలంగి సర్వేయర్) శంఖవరం-1 గ్రామసచివాలయం సర్వేయర్ వీర్ల సురేష్ లు ముందుకి వచ్చారు. మంగళవారం వేలంగిలో మద్ది మంగ అనే ఒంటరి మహిళ కుటుంబానికి నిత్యవసర సరుకులు అందించి తమ దాత్రుత్వాన్ని చాటుకున్నారు. ఈకుటుంబాన్ని పోషించే ఈమె పెద్దకూతురు ఇటీవలే మ్రుత్యువాత పడటం, చిన్నకూతురు అంగవైక్యంతో ఉంటం, వయస్సు మళ్లిన ఆమె ఒంటరి మహిళ కావడంతో వీరు పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువసర్వేయర్లు వారికి నిత్యవసర సరుకులు అందించి చేయూతనందించారు. ఈ సందర్భంగా సర్వేయర్ సురేష్ మాట్లాడుతూ, కరోనా సమయంలో ఎందరో నిర్భాగ్యులు మూడుపూటల తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ ద్రుష్టికి వచ్చిన వారికి తమవంతుగా కొద్దిమేరక సహయం చేస్తున్నామని చెప్పారు. అలాంటి వారికి సహాయం అందించడానికి మరింత మంది దాతలు ముందుకి రావాలని పిలుపునిచ్చారు. మరో సర్వేయర్ సత్య మాట్లాడుతూ, తమ సహచర సర్వేయర్ సురేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు తనను ఎంతగానో ఆలోచింపజేశాయని, దానితో తాను కూడా తనకున్న దానిలోనే నిరుపేదలకు సేవచేయాలని తపించి ముందుకి వచ్చినట్టు వివరించారు. దాతలు, ఉద్యోగులు కూడా ముందుకి వస్తే ఇలాంటి ఎందరో నిరుపేదలకు ఈ కరోనా సమయంలో చేయూతనందించిన వారవుతారని పేర్కొన్నారు. శంఖవరం మండలంలో నిత్యం ఈ యువ సర్వేయర్లు చేస్తున్న సేవకార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి.