పోలీసులకు వెలగానారాయణరావు మందుల వితరణ
Ens Balu
2
Narsipatnam
2020-08-27 21:23:51
కరోనా సమయంలో ప్రజలకు నిరంతరం వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివని ప్రముఖ వ్యాపార వేత్త వెలగానారాయణ రావు అన్నారు. గురువారం నర్సీపట్నం ఏఎస్పీ తుహిసిన్హాకి ఈ మేరకు సుమారు రూ.25వేలు విలువ చేసే రోగ నిరోదకశక్తి మందులను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, పోలీసు సేవలను గుర్తించి వ్యాపారవేత్తలు సహాయం చేయడం అభినందనీయమన్నారు. నర్సీపట్నంలోని పోలీసులందరికీ వీటిని పంపిణీ చేయిస్తామని అన్నారు. తాము చేపట్టే సేవా కార్యక్రమాల్లో భాగంగా వీటిని అందజేస్తున్నట్టు చెప్పిన నారాయణరావు రానున్న కాలంలోనూ తమ తరపున పోలీసు అధికారులకు సహకరిస్తామని అన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది చేస్తున్న సేవలు ఈవిధంగానే కొనసాగించాలని ఆకాంక్షించారు.