ఘనంగా భగీరథ జయంతి..
Ens Balu
4
Srikakulam
2021-05-19 15:46:05
భగీరథ జయంతిని జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన భగీరథ జయంతి కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి టీ.సవరమ్మ భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సవరమ్మ మాట్లాడుతూ దీక్ష, సహనానికి మారుపేరు భగీరథుడు అన్నారు. ఎంత కష్టం అయినా లెక్కచేయకుండా సాధించగల ధీరుడు అన్నారు. దివి నుండి గంగను భూవికి తీసుకు వచ్చిన మహానుభావుడని ఆమె తెలిపారు. భగీరథ దీక్ష, సహనం, పట్టుదల ప్రతి ఒక్కరికి అవసరమని దాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా గొప్ప కార్యాలను సాధించగలమని ఆమె వివరించారు. సమాజానికి భగీరథుడు ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి కే.కే.కృత్తిక, జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు పి.చంద్ర ప్రతి రావు తదితరులు పాల్గొన్నారు.