విలేజ్ ఐసోలేషన్ కేంద్రాలు వినియోగించుకోవాలి..


Ens Balu
3
Peddapuram
2021-05-20 12:01:27

విలేజ్ ఐసొలేషన్ సెంటర్  కోవిడ్ పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ జి. లక్ష్మి శ తెలిపారు. గురువారం పెద్దాపురం మండలం జి. రాగంపేట గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేజ్ ఐసొలేషన్ సెంటర్ ను జాయింట్ కలెక్టరు లక్ష్మీ షా ప్రారంభించారు. అనంతరం  పాత్రికేయులతో జేసీ మాట్లాడుతూ ప్రతి గ్రామ స్థాయిలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు, యువత, అధికారులు విలేజ్ ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు కు కృషి చేయాలనీ అన్నారు. కోవిడ్ వచ్చిన పేషంట్లు 14 రోజులు క్వారైంటైన్ లో వుండి మందులు వేసుకుంటూ కరోనా వ్యాధి నుండి సురక్షితంగా బయటపడవలసి ఉంటుందని అన్నారు. కొంతమందికి ఇంటిలో అవకాశం లేని వారికి విలేజ్ ఐసొలేషన్ సెంటరు ఉపయోగపడుతుందనితెలిపారు.  కరోనా బారినపడినవారు విలేజ్ లో ఐసొలేషన్ సెంటర్ ఉండడం వల్ల వేరే ప్రాంతలకు వెళ్ళకుండా గ్రామంలోనే వుండే అవకాశం ఉంటుందని తెలిపారు. కులాలు, మతాలు మరిచి కోవిడ్ బాధితులను ఆదుకోవడంలో ప్రజలు ముందుకు వస్తున్నారని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా 3000 మంది కరోనా బాధితులకు కోవిడ్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.500 మంది వెంటిలేటర్ లో ఉండగా, 2500 మంది ఆక్సిజన్ తీసుకుంటున్నారని, 500 మంది నార్మల్ బెడ్స్ లో వుంటున్నారని జెసి తెలిపారు. కోవిడ్ బాధితులకు కరోనా మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, అన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఆక్సిజన్ కొరత లేకుండా ప్లాంట్లను అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. మానవతాదృక్పధంతో ముందుకు వచ్చి కోవిడ్ పేషంట్ల కు ప్రతి ఒక్కరు చేయూతను ఇవ్వాలని అన్నారు.జి. రాగంపేట గ్రామం లో సర్పంచి శేఖర్ ,  ఉపసర్పంచ్, వార్డుమెంబర్లు, అధికారులు సమన్వయంతో  ఐసొలేషన్ సెంటరను ఏర్పాటు చేయడం అభినందనియమని అన్నారు. ఇదే స్ఫూర్తి తో  ప్రతి గ్రామంలోనూ విలేజ్ ఐసొలేషన్ సెంటరను ఏర్పాటు చేసి కోవిడ్ పేషెంట్లు కు బాసటగా నిలవాలని అన్నారు. పాజిటివ్ కేసులు వున్న వ్యక్తులు బహిరంగంగా తిరగడం వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. దీనిని అదిగమించడానికి వాలంటీర్లు, ఆశా వర్కర్లు ఎ,హెన్ ఎం ల ద్వారా పాజిటివ్ కేసుల హౌసలను గుర్తించి  కోవిడ్ స్టిక్కరింగ్ ను అంటించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మి శ ఐసొలేషన్ సెంటర్ లో వున్న కోవిడ్ బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులపై అరా తీశారు. వారికీ పండ్లను అందచేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కోవిడ్ పోజిటివ్ కేసు ఇంటికి వెళ్లి  స్వయంగా కోవిడ్ పాజిటివ్ స్టిక్కరింగ్ను, గోడపై అంటించడం జరిగింది. జెసి తో పాటు జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, ఆర్డీఓ ఎస్. మల్లి బాబు ఇరువురు కోవిడ్ పాజిటివ్ స్టిక్కరింగ్ ఇంటికి   అంటించడం జరిగింది. ఈ 6కార్యక్రమంలో  అడిషనల్ డి ఎం అండ్ హెచ్ ఓ సరితా, పులిమేరు పి హెచ్ సి వైద్య అధికారి రాంబాబునాయక్, .అని ఎంపీడీఓ రమణ రెడ్డి, తహసీల్దార్ బి శ్రీదేవి,దవలూరి సుబ్బారావు, పంచాయతీ  సెక్రటరీ సెలెక్ట్ రాజు  గ్రామంలో ప్రజా ప్రతినిధులు, ఏఎన్ఎంలు , ఆశా వర్కర్లు, వాలంటీర్ల్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు