గిరిజనులకు లబ్ధిచేకూర్చడమే లక్ష్యంగా పనిచేయాలి..


Ens Balu
3
Paderu
2020-08-28 13:05:23

గిరిజనులకు లబ్ధిచేకూర్చడమే అటవీ హక్కుల చట్టం లక్ష్యమని  సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్  సలిజామల  స్పష్టం చేశారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయం నుంచి 11 మండలాల రెవెన్యూ అధికారులతో ఆర్.ఓ.ఎఫ్.ఆర్ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంత్రి కార్యాలయం,  గిరిజన సంక్షేమశాఖ శాఖ కార్యదర్శి  (నిన్న27వ తేదీన) గురువారం  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాలు పక్కాగా అమలుచేయాలన్నారు. నేటికి 12వేల ఎకరాలు మాత్రమే సర్వే పూర్తి చేసారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆమోదించిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల్లో సరిహద్దు రాయిని ఏర్పాటు చేసి, లభ్డిదారుని నిలబెట్టి ఫోటో తీసి గిరిభూమి వెబ్సైటులో నమోదు చేయాలని సూచించారు. డి ఎల్సీలో ఆమోదించిన జాబితాను గిరిభూమిలో నమోదు చేయాలని అన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి రెండు ఎకరాలకు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్న ఆయన అర్హులు, అనర్హులను గుర్తింపు ఎలా చేయాలో వివరించారు.