క్రిష్ణదేవిపేట లో కానరాని BSNLసిగ్నల్..


Ens Balu
4
Krishnadevipeta
2021-05-21 05:14:20

విశాఖజిల్లా, గొలుగొండ మండలం క్రిష్ణదేవిపేటకు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ రానంటుంది. ఇక్కడ ప్రైవేటు నెట్వర్కులతో పోల్చుకుంటే బీఎస్సెనెల్ సిగ్నల్ చాలా తక్కువగా వుంది. క్రిష్ణదేవిపేట టెలీఫోన్ ఎక్స్చేంజి పరిధిలో వున్న ఒకే ఒక్క సెల్ టవర్ ఇక్కడ ఉండే వినియోగదారులకు సిగ్నల్ లైన్ అందించలేకపోతుంది. ఈ టవర్ మీద ఆధారపడి సుమారు 40 గిరిజన గ్రామాలున్నాయి. కరోనా సమయంలో విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసులు, ప్రైవేటు ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేస్తుండటంతో వీరందరికీ ఇంటర్నెట్ బాగా అవసరం పడుతుంది. కానీ బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంటర్నెట్ స్పీడు  సిగ్నల్ లేమితో రావడం లేదు. దానీతో తీవ్ర ఇబ్బందులు ఎదర్కోవాల్సి వస్తుంది. ఒక్క క్రిష్ణదేవిపేట, ఏజెన్సీ లక్ష్మీపురం, కొంగసింగి, ప్రాంతాల్లోనే 30వేల మందికి పైగా బిఎస్సెన్నెల్ వినియోగదారులు ఉన్నారు. bsnlతోపాటు jio, airtel మొబైల్ నెట్వర్క్ లు ఇక్కడ వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. క్రిష్ణదేవిపేట గ్రామం ఏజెన్సీకి ముఖద్వారం కావడంతో ఇక్కడకు నిత్యం వందలాది మంది వస్తూ పోతూ ఉంటారు. అదే సమయంలో వినియోగదారుల మొబైల్స్ సిగ్నల్ ఒత్తిడి పడుతుంది. ఈ విషయమై బీఎస్ఎన్ఎల్ అధికారులు ఎన్నిసార్లు విన్నవించానా ఫలితం లేకుండా పోతుందని, ఈ ప్రాంతంలోని కొత్తగా ఎన్నికైన సర్పంచులు వాపోతున్నారు. ఈ విషయమై ఒక్కో పంచాయతీ నుంచి ప్రత్యేకంగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు కూడా చేసినట్టు చెబుతున్నారు.  ఇప్పటికైనా బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ మెరుగు పరచాలని, లేదంటే కొత్తగా మరో టవర్ నిర్మాణం చేపట్టి వినియోగదారుల ఇబ్బందులు తీర్చాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

సిఫార్సు