అన్నవరంలో జోరుగా సోడియం క్లోరైడ్ స్ప్రేయింగ్..


Ens Balu
4
Annavaram
2021-05-21 09:00:15

కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ సూచించిన నిబంధనలు తప్పక పాటించాలని పంచాయతీ కార్యదర్శి రాంబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం అన్నవరం మేజర్ పంచాయతీలోని పలు వీధుల్లో సోడియం హైపోక్లైరైడ్ ద్రావణాన్ని ఆయన దగ్గరుండి పిచికారీ చేయించారు.  బిసి కాలనీ, సుబ్బరాయపురం ప్రాంతాల్లో శానిటేషన్ సిబ్బంది ప్రతీ ఇంటి వద్ద ఈ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో బ్లీచింగ్ తోపాటు, ఈ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నామన్నారు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. తరచూ చేతులకు శుభ్రపరుచుకోవడం తోపాటు, పరిశరాలను కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. వీధుల్లో చెత్త అధికంగా వున్న గ్రామవాలంటీర్ల ద్వారా సమాచారం ఇస్తే తక్షణమే చెత్తను శుభ్రం చేయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కె.సూరిబాబు, ఎ.శ్రీనివాస్, కె.శ్రీను. సోము గౌరిశంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు