మే 24న ఆశాల దేశవ్యాప్త సమ్మె..
Ens Balu
4
Bobbili
2021-05-22 09:54:54
ఆశాల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే 24న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా శ్రామిక మహిళా సంఘం నాయకులు లంగశాంతమ్మ పిలుపునిచ్చారు. శనివారం బొబ్బిలిలో ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. ఆశవర్కర్లను తక్షణమే ప్రభుత్వం పర్మినెంటు చేయాలన్నారు. మిగిలిన శాఖ మాదిరిగా కనీస వేతనం రూ.21000 చెల్లించడంతోపాటు ఇన్య్సూరెన్సు సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కరోనా రోగులకు విశేషంగా సేవలు చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లతో చేపట్టే ఈ సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలియజేయాలని కోరారు. ఈకార్యక్రమంలో శ్రామిక సంఘం నాయకులు మాలతి, ఇందిరా, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.