పాజిటివ్ వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలి..


Ens Balu
4
Yalamanchili
2021-05-22 10:10:37

కరోనా పాజిటివ్ రోగులు జాగ్రత్తలు పాటించాలని సచివాలయ ఆరోగ్యకార్యదర్శి ఎ.నాగమణి సూచించారు. యలమంచిలి పురపాలకసంఘం పరిధిలోని 6వ వార్డులో శనివారం కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో వున్న రోగుల బంధువలకు ప్రభుత్వం సూచించిన సలహాలను ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చిన వారు 14 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో వుంటూ ప్రభుత్వం సరఫరాచేసిన మందులను క్రమం తప్పకుండా వాడాలన్నారు. అదే సమయంలో బలవర్ధక ఆహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సమయంలో ఎవరికైనా శ్వాసకోస సమస్యలు వస్తే తక్షణమే 104కి సమాచారం తెలియజేయడం ద్వారా వారు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారని అన్నారు. పాజిటివ్ వచ్చిన రోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని హెచ్చరించారు. వారికి దూరం నుంచే ఆహారాలను, వేడినీరు అందించాలని సహాయకులకు సూచించారు.
సిఫార్సు