కరోనాపై యుద్దాన్ని ఉద్రుతం చేయాలి..


Ens Balu
5
Anantapur
2021-05-22 13:26:56

అనంతపురం జిల్లాలో కరోనాపై పోరాటాన్ని ఉధృతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ మునిసిపల్ , మండల స్థాయిలో  కోవిడ్ వార్ రూమ్ లు ఏర్పాటు చేసుకుని కరోనాపై పోరాటం చేస్తున్నామని, ఇక నుంచి గ్రామ స్థాయిలో సర్పంచ్ నేతృత్వంలో గ్రామ కరోనా కట్టడి కమిటీల ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  శనివారం  వివిధ  అభివృద్ధి పనుల పురోగతిపై   జాయింట్ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్   టెలీ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. నిర్వహించారు. జిల్లాలో పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతోందని, ఇలాంటి సమయంలో పకడ్బందీగా వ్యవహరిస్తే పాజిటివిటీ రేటు మరింతగా తగ్గించొచ్చన్నారు. జిల్లాలో కరోనాపై పోరాటంలో భాగమైన  ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలన్నారు.  వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వే, కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణ, హోమ్ ఐసోలేషన్ కిట్ల పంపిణీ అన్నీ పక్కాగా నిర్వహించాలన్నారు. 104 సేవల్లో లోపాలు లేకుండా చూడాలన్నారు. పట్టణాలలో,గ్రామాల్లో  శానిటేషన్ కార్యక్రమాలు ఉధృతం చేయాలని డి పి ఓ, మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు.

 అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం వద్దు 

కరోనా సాకుతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఉపాధి హామీ పనులలో రోజుకు నాలుగున్నర లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నామన్నారు. డ్వామా పీడీ మరింత శ్రద్ద తీసుకుని  సోమవారం నాటికి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా చూడాలన్నారు. 

గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు,అంగన్వాడీ భవనాలు, పాల శీతలీకరణ కేంద్రాల భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు.  బేస్మెంట్ స్థాయి, గ్రౌండ్ ఫ్లోర్ స్థాయి లో వున్న నిర్మాణాలను పురోగతి చూపించి తదుపరి స్థాయిలకు వెళ్లేలా చూడాలన్నారు.ఆ పై స్థాయిలో వున్న భవన  నిర్మాణాలను పూర్తి చేసేలా చూడాలన్నారు. పాల శీతలీకరణ కేంద్రాల భవనాల నిర్మాణ పనులను గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెటీరియల్ ఎక్స్పెండించర్ లో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. అంగన్వాడీ భవనాలకు త్వరితగతిన సైట్ ను గుర్తించాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన మ్యాపింగ్, జియో ట్యాగింగ్ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలన్నారు. ఇళ్ల కాలనీల అభివృద్ధి పనులు, కాలనీలకు నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నవరత్నాల ఫలాలను అందించడంలో ముందుండాలన్నారు. పెన్షన్ల పంపిణీ, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ, బియ్యం కార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. 

వ్యవసాయ సీజన్ లో విత్తనాల పంపిణీ, ఎరువుల పంపిణీ వంటి కార్యక్రమాలలో ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. బ్యాంకుల వద్ద రుణ వితరణ, లోన్ రెన్యూవల్ కార్యక్రమాలు కరోనా నిబంధనలు పాటిస్తూ కోసాగేలా చూడాలన్నారు. వైఎస్సార్ జలకళ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు పెద్ద ఎత్తున బోర్లు తవ్వించాలన్నారు. ఇప్పటికే వీఆర్వోల వద్ద పెండింగులో ఉన్న జలకళ అప్లికేషన్లను ప్రాసెస్ చేయాలన్నారు.90 రోజుల్లో పు ఇళ్ళ స్థలాల పంపిణీకి సంబంధించి  దరఖాస్తులను క్లియర్ చేయాలన్నారు.స్పందన సమస్యలన్నీ గడువు లోపు పరిష్కరించాలన్నారు...పట్టణాల్లో శానిటేషన్,,వీధి దీపాలు, తాగు నీటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడద ని మునిసిపల్ కమిషనర్ లను ఆదేశించారు.
సిఫార్సు