ప్రతీ పంచాయితీలో విలేజ్ కోవిడ్ మేనేజ్ మెంటు కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శనివారం విఎంఆర్.డిఎ. లో పెరి- అర్బన్, గ్రామీణ, ఏజన్సీ ప్రాంతాలలో కోవిడ్-19 కంటైన్ మెంట్ అండ్ మేనేజ్ మెంట్ అంశముపై ఆయన ఎంపిడిఓలు, వైద్యాధికారులకు వర్క్ షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జివియంసి ఔట్స్ కట్స్, గ్రామీణ, ఏజన్సీ ప్రాంతాలలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, పి.హెచ్.సి. వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామ స్థాయిలో వైద్యాధికారులు అప్రమత్తతతో ఉండాలని చెప్పారు. మండల స్థాయిలో ఎంపిడిఓలు, వైద్యాధికారులు ఒక టీముగా ఏర్పాటై పనిచేయాలన్నారు. గ్రామ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని ఇందులో సర్పంచ్ అధ్యక్షులుగాను, ఎఎన్ఎం కన్వీనర్, సభ్యులుగాను, వార్డు సభ్యులు, గ్రామ వాలంటీర్ సభ్యులుగా ఉంటారన్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్న వారిని బయటికి రాకుండా తగు సూచనలు గావించాలన్నారు. ప్రతీ గ్రామాన్ని కోవిడ్ రహిత గ్రామంగా మార్చడానికి కృషి చేయాలన్నారు. ఆశా కార్యకర్త, గ్రామ వాలంటీర్ ప్రతి ఇంటిని సర్వే చేయాలని, ఏజన్సీలో మలేరియా పైన కూడా సర్వే చేయాలన్నారు. సస్పెక్ట్ కేసులకు ర్యాపిడ్ ఏంటిజన్, ట్రూనాట్ పరీక్ష చేసి పాజిటివ్ వస్తే వెంటనే హోం ఐసోలేషన్ లో ఉంచి వారికి కిట్ అందజేయాలని, ప్రతీరోజు ఆశా కార్యకర్త వెళ్లి పరిశీలించాలని చెప్పారు. గ్రామ స్థాయిలో ఐసోలేషన్ రూంలు ఏర్పాటు చేయాలని, కో- మార్పిడిటీస్ ఉంటే టెలీకన్ సల్టెన్సీ తీసుకోవాలి పేర్కొన్నారు. నియోజక వర్గాల నుండి సీరియస్ కేసులు మాత్రమే విశాఖపట్నం పంపాలని నియోజక వర్గాల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. మాస్క్ లు లేకుండా ఎవరూ బయటకు రాకుండా ప్రచారం గావించాలన్నారు. గ్రామాల్లో హోర్డింగ్ లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో సర్పంచ్ ల సహాయ, సహకారాలను తీసుకోవాలన్నారు. ప్రతి పి.హెచ్.సి.కి ఆంబులెన్స్ సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని ఆదేశించారు.
అంతకు ముందు ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ కోవిడ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలు, రిస్క్ కమ్యూనికేషన్, క్లీనింగ్ అండ్ ఇన్ఫెక్షన్, క్లినికల్ మేనేజ్ మెంట్, కమ్యూనిటీ మొబలైజేషన్, ట్రైబల్ కోవిడ్ - 19 కేర్ లపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అంతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పెరి అర్బన్, గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరింత జాగ్రత్తగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో కమిటీలు ఉన్నాయని వారిని మరింత అవగాహన పరచి కోవిడ్ నివారణకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏజన్సీ ప్రాంతంలో మండలానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు గావించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్ అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణు గోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్, ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, డిఎంహెచ్ సూర్యనారాయణ, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, జె.సి.-3 ఆర్. గోవిందరావు, విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు ఆర్డిఓలు పెంచల కిషోర్, సీతారామారావు, లక్ష్మీ శివజ్యోతి, జడ్పి సిఇఓ నాగార్జున సాగర్, నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు, ఎంపిడిఓలు, తదితరులు పాల్గొన్నారు.