కార్యదర్శిలు మళ్లీ డీడీఓలైనా ఈ2నెలలే..
Ens Balu
19
Tadepalle
2021-05-23 17:05:52
గ్రామ, వార్డు సచివాలయాల్లో వీఆర్వోలను డిడిఓలుగా చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓనెం 1,2లను రెండు నెలలు ప్రభుత్వం గాల్లో పెడుతూ మళ్లీ గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ ఎన్.భరత్ గుప్తా సర్క్యులర్ నెంబరు.RoC.No.GWS01-COOR/103/2021-GWS,1396763,21/05/2021న జారీచేశారు. ఆ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net ద్వారా ఆధారాలతో సహా బయటకు తీసుకు వచ్చింది.. తమ ఆందోళన వలనే ప్రభుత్వం నేరుగా డిడిఓ బాధ్యతల నుంచి వీఆర్వోలను తప్పించేసి మళ్లీ తమకే ఇచ్చేసిందని సచివాలయ కార్యదర్శిలంతా సంబరపడిపోయారు. అయితే ఆ ఉత్తర్వులు కేవలం రెండు నెలల కాలానికి మాత్రమే పరిమితం చేస్తూ ఆ సర్క్యులర్ లో పేర్కొన్న విషయం ఈఎన్ఎస్ లైవ్ యాప్ ఆధారాలతో తెలియజేయడంతో వారంతా ఖంగుతిన్నారు. చాలా మీడియా సంస్థలు కూడా అదేవిధంగానే ఎలాంటి ఆధారాలు చూపకుండానే మళ్లీ వీఆర్వో డిడిఓ బాధ్యలు కార్యదర్శిలకు ప్రభుత్వం అప్పగించేసిందని తెగ ప్రచారాలు చేశాయి కూడా. వాటినే నిజమనుకున్న సచివాలయ కార్యదర్శిలు రాష్ట్రవ్యాప్తంగా ఆ వార్తలను వాట్సప్ గ్రూపుల్లో తెగ వైరల్ చేసేసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిపాలనా పరమైన ఇబ్బందులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో వచ్చే సాంకేతిక కారణాలను ద్రుష్టిలో పెట్టుకొని డిడిఓల బాధ్యతలు పంచాయతీ కార్యదర్శిలకే ఇస్తూ ఈ సర్క్యులర్ జారీచేశారు. ఏడాదిన్నరగా సచివాలయల్లో కార్యదర్శిలే డిడిఓలుగా ఉంటూ విధులు నిర్వహిస్తూ వచ్చారు. ప్రభుత్వం గ్రామస్థాయిలో వీఆర్వోలు సచివాలయాల్లోనూ, మండలాల్లో తహశీల్దార్లను, జిల్లా స్థాయిలో కలెక్టర్లను ముఖ్య అధికారులుగా చేయాలనే ఉద్దేశ్యంతో సచివాలయాల్లో వీఆర్వోలను డిడిఓలుగా చేస్తూ జీఓ నెంబరు2 జారీచేసింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా వున్న 15005 సచివాలయాల్లో జీతాలు ఇతరత్రా కార్యకాలపాలకు ఇబ్బందులు రావడంతో జీఓనెంబరు2 ని రెండు నెలలు పాటు అంటే మే, జూన్ నెలలకు నిలుపుదల చేస్తూ మళ్లీ సర్క్యులర్ జారీచేసింది. ఈ ఉత్తర్వులు కేవలం రెండు నెలలకు మాత్రమే ఇచ్చారని తెలియడంతో పంచాయతీ కార్యదర్శిలంతా నీరస పడిపోయారు. విషయం తెలియక అలిగి కూర్చున్న వీఆర్వోలంతా రెండు నెలల తరువాత మళ్లీ డిడిఓలు, గ్రామ సచివాలయ ప్రధాన అధికారి తమరే అన్నట్టు దీమాల వ్యక్తం చేస్తున్నారు. సర్క్యులర్ జిల్లా పంచాయతీ అధికారులకే వెళితే గ్రామసచివాలయాలకు సత్వరమే తెలియదనే ఉద్దేశ్యంతో ఈసారి ఆ సర్య్యులర్ లను జిల్లా ఖజానాశాఖ అధికారులకు, ఉప ఖజానా అధికారులకు, అన్ని మండలాల ఎంపీడీఓలకు పంపడం విశేషం. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఈ శాఖలో జరిగే అభివ్రుద్ధి పనులు, ఉత్తర్వులు, ప్రత్యేక జీఓలను మొట్టమొదటిసారిగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మాత్రమే బాహ్య ప్రపంచానికి, ఇటు సచివాలయ ఉద్యోగులకు తెలియజేస్తుంది. ఇప్పుడు కూడా అటు డిడిఓలుగా వీఆర్వోలు, రెండు నెలలకే అధికారాలు ఉంటాయనే సర్క్యులర్ అందుకున్న పంచాయతీ కార్యదర్శిలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఈప్రత్యేక కధనాన్ని అందిస్తున్నాం. వాస్తవానికి గ్రామసచివాలయాల్లో కార్యదర్శిలు కాకుండా వీఆర్వోలు డిడిఓలుగా ఉండటం, మళ్లీ కార్యదర్శిలు సెల్ఫ్ డిడిఓలుగా ఉండే అంశం కాస్త గజిబిజిగానే ఉంది. ఈ విషయంలో తమకు అధికారాలు కల్పించాలని చాలా మంది కార్యదర్శిలకు తమ గోడును ఎంపీడీఓల ద్వారా ప్రభుత్వానికి నివేదించిన ఆందోలన చేసినా ఉపయోగం లేకుండా పోయింది. కాకపోతే గ్రామసచివాలయాల్లో కార్యదర్శిలే డిడిఓలుగా ఉంటే పరిపాలనా పరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయనే విషయం సర్వత్రా వినిపిస్తుంది. అంతేకాకు ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా విడుదల చేసే అవకాశాలు లేకుండా పోతాయి..మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం రెండు నెలల తరువాత గానీ తేలేటట్టు కనిపించడం లేదు..చూడాలి ఈ సర్క్యులర్ ను ప్రభుత్వం కొనసాగిస్తుందా..లేదంటే రెండు నెలల తరువాత మళ్లీ డిడిఓ అధికారాలు వీఆర్వోలకు అప్పగిస్తుందా..తేలాల్సి వుంది..!