చెత్తబుట్టలు లేకపోతే ఫైన్లు వేయండి..
Ens Balu
5
City Central
2021-05-24 13:10:05
అపరిశుభ్ర వాతావరణంలో కిరాణాషాపులు, దుఖాణాలు నిర్వహిస్తూ..చెత్తబుట్టలు ఏర్పాటు చేయని నిర్వాహకులపే అపరాద రుసుము వసూలు చేయాలని జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని నాలుగవ జోన్ పరిదిలోని 31వ వార్డు గొల్లలపాలెంలో కమిషనర్ పర్యటించి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తడి –పొడి చెత్త నిర్వహణ ఎలాఉందనే విషయాన్ని స్థానిక ప్రజలను అడిగితెలుసుకున్నారు. పారిశుధ్య సిబ్బంది ప్రతీ రోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ చేస్తున్నదీ లేనిదీ ఆరా తీసారు. కొన్ని దుకాణాల వద్ద డస్ట్ బిన్స్ లేకపోవడం ఆ దుకాణాల చెత్త రోడ్లపై ఉండడం గమనించి ఆయా దుకాణాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. ఇక పై ప్రతీ దుకాణం వద్ద మూడు డస్ట్ బిన్లు ఉండేలా చూడాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. రోడ్లపై చెత్తను చూసి ఆ చుట్టు ప్రక్కలున్న 50 ఇళ్ళకు అపరాధ రుసుము వసూలుచేయాలని ఆదేశించారు. చెత్తను సకాలంలో తొలగించనందుకు వార్డు శానిటరి ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్త్తం చేసారు. రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎప్పటికప్పుడు డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. చెత్తను తడి – పొడి చెత్తగా విభజించి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని స్థానిక ప్రజలకు సూచించారు. గొల్లలపాలెం లోని అంగన్వాడి కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తున్నారని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయగా పోలీసు కంప్లైంట్ ఇవ్వాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, రోడ్లపై విచ్చలవిడిగా తిరగరాదని, మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఫీవర్ సర్వే జరుగుచున్న తీరుతెన్నులను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వార్డు వాలంటీర్లు ద్వారా తెలియపరచాలని కోరారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ ఫణిరాం, పర్యవేక్షక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, శానిటరి ఇన్స్పెక్టర్, శానిటరి సూపర్వైజర్, వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.