ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో కోవిడ్ సేవలు..
Ens Balu
4
Rowthulapudi
2021-05-25 14:49:56
రౌతులపూడి ప్రభుత్వ హాస్పిటల్ లో పూర్తిస్థాయిలో కోవిడ్ వైద్యసేవలు అందాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవలు, ఇక్కడి వార్డులను ఆర్డీఓ మల్లిబాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సెకెండ్ వేవ్ లో కరోనా వైరస్ కేసులు తీవ్రంగా ఉన్నాయని, వచ్చే థర్డ్ వేవ్ ను ద్రుష్టిలో పెట్టుకొని ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పూర్తిస్థాయిలో మందులు, బెడ్ లు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుకొని సేవలు అందించాలన్నారు. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ఆక్సిజన్ సిలిండర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈమేరకు ఆసుపత్రికి కావాల్సిన వనరుల అంశాన్ని సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.