సచివాలయాల పరిధిలో వాక్సినేషన్..


Ens Balu
5
Srikakulam
2021-05-26 13:25:08

శ్రీకాకుళం జిల్లాలో అన్ని సచివాలయాల పరిధిలో వాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వాక్సినేషన్ జరుగుతుందన్నారు. మంగళవారం, బుధవారం ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో 835 సచివాలయాల పరిధిలో కోవిషీల్డ్  మొదటి విడత వాక్సినేషన్ కార్యక్రమంను సాధారణ ప్రజానీకానికి చేపడుతున్నామని చెప్పారు. 45 సంవత్సరాలు వయస్సు దాటిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వాక్సినేషన్ జరుగుతుందని తెలిపారు. రోజుకు ముందుగా సమాచారం అందించిన 150 మందికి వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న  ప్రతి కేసును కవర్ చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 3 లక్షల మంది ఉంటారని అంచనా ఉందని, వారందరికీ వారం, 10 రోజుల్లో వాక్సినేషన్ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 
సిఫార్సు