శంఖవరం మంలంలోని అన్ని గ్రామ సచివాలయాల నుంచి టోకెన్ల ద్వారా 292 మందికి వేక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేసినట్టు వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. బుధవారం పీహెచ్సీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు రెండు పూటలా వేక్సినేషన్ చేపట్టామన్నారు. ప్రభుత్వ సూచించిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేక్సినేషన్ ప్రక్రియ చేపట్టామన్నారు. ఈరోజు కార్యక్రమాన్ని ఎంపీడీఓ రాంబాబు కూడా పరిశీలించినట్టు డాక్టర్ తెలియజేశారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కోవిడ్ టీకాలు వేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని మూడు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నట్టు వైద్యాధికారి వివరించారు.