వయస్సు నిబంధన లేకుండా వేక్సిన్ వేయాలి..


Ens Balu
5
Dwaraka Nagar
2021-05-27 03:37:30

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వయస్సుతో సంబంధం లేకుండా కోవిడ్ వేక్సిన్ వేయాలని ఈఎన్ఎన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(www.enslive.net, ens live mobile news app) ప్రధాన సంపాదకులు, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) ప్రభుత్వాన్ని కోరారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సెకెండ్ వేవ్ ఉద్రుతంగా ఉన్న సమయంలో కూడా జర్నలిస్టులందరూ ప్రాణాలకు తెగించి బాహ్య ప్రపంచంలోని సమాచారాన్ని అటు ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇలాంటి సందర్భంలో కేవలం 45 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకే వేక్సిన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 సంవత్సరాల లోపు వున్న జర్నలిస్టులే అధికంగా ఉన్నారని చెప్పిన ఆయన సకాలం వేక్సిన్, వైద్యం అందక ఒక్క విశాఖ జిల్లాలోనే సుమారు 13 మంది జర్నలిస్టులు మ్రుత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం జర్నలిస్టులకు వయస్సు నిబంధన తొలగించి అన్ని వయస్సుల వారికి కోవిడ్ వేక్సిన్ వేయాలని ఈఎన్ఎస్ బాలు డిమాండ్ చేశారు.
సిఫార్సు