నిబంధనలు పాటిస్తూ వేక్సినేషన్ చేయాలి..
Ens Balu
3
Sankhavaram
2021-05-27 13:34:39
కోవిడ్ వేక్సినేషన్ కేంద్రం వద్ద ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ ప్రజలకు కోవిడ్ టీకాలు వేయాలని శంఖవరం మండల ఈఓపీఆర్డీ కెవివిఎస్ కాశీవిశ్వనాధ్, శంఖవరం పంచాయతీ కార్యదర్శి రాంబాబులు సిబ్బందికి సూచించారు. గురువారం శంఖవరం జిల్లాపరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన శాస్వత కోవిడ్ కేంద్రంలో కోవిడ్ వేక్సినేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామసచివాలయాల పరిధిల్లోనూ వాలంటీర్ల ద్వారా టోకెన్లు జారీచేయిస్తున్నామన్నారు. వాటితోపాటు కేంద్రం దగ్గర కూడా టోకెన్ల పంపిణీకి చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్ టీకా లక్ష్యాలను శంఖవరం మండలం అధిగమించేలా త్వరగా వేక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. కేంద్రానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు, వేక్సిన్ వేసిన తరువాత సేద తీరడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేసినట్టు వివరించారు. సచివాలయ సిబ్బంది ద్వారా టోకెన్లు ఆన్ లైన్ చేయించి వేక్సినేషన్ చేపడుతున్నామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి వాతవరణంలో వేక్సినేషన్ ప్రక్రియ జరగాలన్నారు. కార్యక్రమంలో మూడు సచివాలయాల వీఆర్వోలు సీతారామ్, గణేష్, కార్యదర్శిలు సత్య, శంకరాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ రమణమూర్తి, మహిళా పోలీసులు, ఆరోగ్యసిబ్బంది పాల్గొన్నారు.