దేశంలో ప్రజలంతా సుభిక్షింగా ఉండాలని, కరోనా విపత్తు నుంచి ప్రతీ ఒక్కరూ ఆరోగ్యవంతంగా బయటపడాలని ఇక్కడ సీతమ్మధార షిరిడిసాయి మందిరంలో శుక్రవారం ధన్వంతరి హోమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ ఇవో కె.శిరీషా ఆధ్వర్యంలో ఈ హోమాన్ని వేదపండితులు , అర్చకులు ఘనంగా జరిపించారు. వేదమంత్రోశ్చరణలు , మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ హోమంలో తొలుత కళశారాధన గావించారు. ఆ తరువాత హోమాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ పలు మార్లు వేదమంత్రాలు పఠనం చేశారు. అనంతరం ఆలయ ఈవో శిరీషాతో వేదపండితులు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ధన్వంతరిహోమాన్ని షిరిడీ సాయి ఆలయము లో నిర్వహించడం జరిగిందన్నారు . లోకకళ్యాణార్ధం ఈ హోమాన్ని తలపెట్టామన్నారు . ధన్వంతరి హోమంతో దేశప్రజలందరికి మెరుగైన ఆరోగ్యం సిద్ధించాలని తాము స్వామిని వేడుకున్నట్లు ఇవో చెప్పారు . ఇటువంటి దైవ హోమాలుతో కరోనా విపత్తు నుంచి ప్రజలు బయటపడేందుకు అపారమైన అవకాశాలున్నాయన్నారు . ధన్వంతరి అంటే దేవవైద్యుడని అటువంటి స్వామిని పూజిస్తే అన్ని రుగ్మతులు పూర్తిగా తొలగిపోతాయని ఇవో ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు , జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీసుబాబు ధన్వంతరి హోమము లోపాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ దేశంలో ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర దేవాదాయశాఖ ఇటువంటి ధన్వంతరి హోమాలు చేపట్టడం అభినందనీయమన్నారు . ఇటీవలే సింహాచలంలోనూ శుక్రవారం షిరిడిసాయి మందిరంలోను ఈ ధన్వంతరి హోమాలు జరిగాయని , మిగిలిన ఆలయాల్లో కూడా ఈ తరహా హోమాలు జరిపించి ప్రజలను కరోనా నుంచి కాపాడే అసీస్సులు ప్రసాదించాలని ఆ ధన్వంతరి స్వామిని అందరూ వేడుకోవాలని ఆకాంక్షించారు.