460 మందికి కోవిడ్ వేక్సినేషన్..


Ens Balu
4
Sankhavaram
2021-05-29 13:56:33

శంఖవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శాస్వత కోవిడ్ వేక్సినేషన్ సెంటర్ లో శనివారం 460 మందికి కోవిడ్ టీకా(కోవీషీల్డ్) వేసినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు ఆయన వేక్సినేషన్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. ముందుగా వేక్సినేషన్ కి టోకెన్లు జారీచేసిన తరువాత వాటిని ఆన్ లైన్ చేసి వెంట వెంటనే వేక్సిన్ నేషన్ పూర్తిచేసినట్టు చెప్పారు.  కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నేపథ్యంలో  బయటకు వెళ్లే సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా బౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతీఒక్కరూ వేక్సినేషన్ కేంద్రానికి వచ్చేటపుడు మాస్కులు విధిగా ధరించాలని సూచించారు.  ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. అప్పటికీ ఇబ్బందులు ఉంటే 104కాల్ సెంటర్ కాల్ చేయడం ద్వారా మెరుగైన వైద్యం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించే వీలుంటుందని చెప్పారు. ఏ పనిచేయడానికైనా ముందు నాణ్యమై శానిటైజర్ ను వినియోగించాలన్నారు. ఆసుపత్రిలో హోమ్ ఐసోలేషన్ కిట్లను అందిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారానే కరోనాని నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని డాక్టర్  ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు.
సిఫార్సు