త్వరితగతిన నిర్మాణాలు పూర్తికావాలి..


Ens Balu
3
Karalapalem
2021-05-30 12:07:01

ప్రభుత్వ భవనాల నిర్మాణపనులు నిర్దేశిత సమయంలో పూర్తి అయ్యేల పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కర్లపాలెం మండలం బుద్ధాం గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతుభరోసా కేంద్రం, విలేజ్ వెల్నెస్ కేంద్రం భవనాలను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సబ్ కలెక్టర్ మయూర్ అశోక్తో కలిసి పరిశీలించారు. కూలీలను ఎక్కువ మందిని పెట్టి నిర్మాణం పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రతినిధులను  కలెక్టర్ ఆదేశించారు. పూర్తి అయిన పనులు వెంటనే ఎంబుక్లో రికార్డు చేసి బిల్లుల చెల్లింపుకు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పనుల రోజువారి పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్మాణ ఏజెన్సీలకు అవసరమైన సహకారం అందించాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ ఎస్ఈ నతానియోల్, కర్లపాలెం ఎంపీడీవో ఉషారాణి, డిప్యూటీ తహశీల్దారు సాంబశివరావు, ఈవోపీఆర్డీ శరత్ బాబు,  పీఆర్ ఏఈ ప్రసన్న కుమార్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
సిఫార్సు