అన్నిదానాల్లో కెల్లా అన్నదానం మిన్న..
Ens Balu
3
Madhurawada
2021-05-30 14:30:42
అన్ని దానాలలో కంటే అన్నదానం చాలా గొప్పదని మహా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. ఆదివారం విశాఖలోని బ్లాక్ అండ్ వైట్ మీడియా సంస్థ చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, విపత్కర పరిస్థితుల్లో అన్నదానం చేయడానికి ముందుకు వచ్చిన సంస్థలకు అభినందనలు తెలియజేశారు. అనంతరం మధురవాడ మారికవలస మొదలుకుని గాయత్రి హాస్పిటల్, ఆరిలోవ విమ్స్ హాస్పిటల్, పరిసర ప్రాంతాల్లో కోవిడ్ బాధితులకు సహాయకులుగా వచ్చిన వారు పారిశుద్ధ్య సిబ్బందికి మద్దిలపాలెం జంక్షన్, ఆర్.టి.సి. కాంప్లెక్స్, డాబాగార్డెన్స్, జగదాంబా జంక్షన్ వరకూ రహధారుల ప్రక్కన ఉన్న నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ శాఖ సిబ్బంది కూడా ఆహారం పొట్లాలను అందజేశారు. సురక్ష హాస్పిటల్ ఎండి డాక్టర్ బొడ్డేపల్లి రఘు, తదితరులు మాట్లాడుతూ కరోనా సమయంలో చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.