నిరు పేదలకు మరింతగా వైద్య సేవలు..


Ens Balu
3
Anakapalle
2021-05-31 12:09:27

పేదలకు వైద్య సేవలు విస్తరించేందుకు వైద్య కళాశాలలు దోహద పడతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 వైద్య కళాశాలలు శంఖుస్థాపనలో భాగంగా అనకాపల్లి వ్యవసాయ క్షేత్రం వద్ద వైద్య కళాశాలకు సోమవారం ఆయన వర్చ్యువల్ విధానంలో శంఖుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం వున్న వైద్య కళాశాల ఒత్తిడి ఎక్కువైనందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారున్నారు. పార్లమెంటు నియోజకవర్గ పధిలో ఒక వైద్య కళాశాల నిర్మాణంలో భాగంగా వైద్య కళాశాలలు శంఖుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు.  ఈ వైద్య కళాశాలు దాదాపు 8 వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టి 2023 సంవత్సరం డిసెంబర్ నాటికి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలు నాడు - నేడు కార్యక్రమంలో అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 
విశాఖపట్నం జిల్లా నుండి అనకాపల్లి పార్లమెంటు సభ్యులు బి.వి. సత్యవతి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వైద్య కళాశాల నిర్మాణం పూర్తయితే పేద ప్రజల ఆరోగ్యం కాపాడిన వారవుతారన్నారు. నేను ఒక డాక్టరుగా ఈ ప్రాంత వైద్య కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చేప్పారు. 
జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ అనకాపల్లి లో వైద్య కళాశాల నిర్మాణం చేపట్టడం వలన ఈ ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇందులో సబ్ ప్లాన్ ప్రాంత ప్రజలు ఉన్నారని, సీరియస్ గా ఉన్న పేషెంట్లను విశాఖపట్నం తీసుకుని రావాలంటే కనీసం గంటన్నర సమయం పడుతుందని, ఈ లోపల దారిలోనే పేషెంటు మరణించే అవకాశం ఉండొచ్చొన్నారు. 
       అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ ఈ ప్రాంతం లో ముఖ్యమంత్రి పేరు చరిత్రలో నిలచిపోయే విధంగా చేశారన్నారు. ఈ ప్రాంత ప్రజలు జీవితాంతం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే వుంటారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత  ఏ ప్రభుత్వం ఇన్ని  సంక్షేమ పథకాలను అమలు చేయలేదని పేర్కొన్నారు. మీ పరిపాలన దేశానికే ఆదర్శమని, మీ కార్యకర్తగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.  వైద్య కళాశాల నిర్మాణం పూర్తయితే దాదాపు 15 లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం రోగులను విశాఖపట్నం కెజిహెచ్ కు రిఫర్ చేస్తున్నారని చెప్పారు. నియోజక వర్గ ప్రజలు, ఈ ప్రాంత ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 
జయలక్ష్మి అనే మహిళ ముఖ్యమంత్రి తో ఇంటరాక్షన్ :  ఈ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు  మీకు కృతజ్ఞతలు తెలియజేసు కొనుచున్నాను అన్నారు.  నా భర్తకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 60 శాతం ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ చెప్పినట్లు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వస్తే 104 కాల్ సెంటర్ కి ఫోన్ చేయండి అని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఏడ్ ను చూసి 104 కాల్ సెంటర్ ఫోన్ చేయగానే 108 ఆంబులెన్స్ ను పంపించారు.  అక్కడ నుండి విమ్స్ ఆసుపత్రికి తరలించి మంచి వైద్యం అందించి నా భర్తను కాపాడారన్నారు. డబ్బులు ఎంత కట్టాలని డాక్టర్లును అడితే ఒక్క రూపాయి కట్టక్కర్లేదని, ఆరోగ్య శ్రీ లో వైద్యం చేసినట్లు తెలిపారు. నా భర్తను కాపాడినందుకు మీకు కృతజ్ఞతలన్నా.  అని సంబరంగా చెప్పారు.
ప్రతీ రోజు కలెక్టర్ ఆఫీసు నుండి ఫోన్ చేసి నా భర్త బాగోగులు గూర్చి అడిగి తెలుసుకునేవారన్నా. సున్నా వడ్డీ, అమ్మఒడి పథకాలు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని చెప్పారు. ముసలి వారికి పెన్షన్లు, ఇలా ఎన్నో పథకాలు పేదవారి కోసం ప్రవేశ పెట్టి పేదవారిని ఆదుకుంటున్నారన్నారు. 
         అంతకు ముందు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. 
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు,  విశాఖపట్నం నగర మేయర్ జి. హరి వెంకట కుమారి, శాసన సభ్యులు గొల్ల బాబూరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, కరణం ధర్మశ్రీ, అదీప్ రాజ్, జాయింట్ కలెక్టర్-2 పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్-3 ఆర్.గోవిందరావు, అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి. సుధాకర్, ఎపిఎంఎస్ఐడిసి ఈఈ డి.ఎ. నాయుడు, అనకాపల్లి తహసీల్దార్ శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 
      అనంతరం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ  అనకాపల్లిలో వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నర్సింగ్ కళాశాలలకు దాదాపు 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ నిర్మాణం డిశంబరు 2023 సంవత్సరం నాటికి పూర్తి అవుతుందని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నేరవేర్చుతున్నట్లు వెల్లడించారు. తాను మంత్రిగా ఉండగా జిల్లాలో రెండు వైద్య కళాశాలలకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్ వైద్య కళాశాలకు సంబంధించిన భూ సమస్య గూర్చి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కరించినట్లు వివరించారు. 

సిఫార్సు