తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు..ప్రధాని మోడీ
Ens Balu
3
New Delhi
2020-08-29 20:56:46
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన శుభాకాంక్షలు తెలిపారు. 'తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాల పై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను.' అంటూ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. అదేవిధంగా ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్.జగన్మోహనరెడ్డి, కేసిఆర్ లు కూడా గిడుగుకి ఘనంగా నివాళులు అర్పించారు. అన్ని జిల్లాల్లోనూ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు మంత్రులు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివ్రుద్ధికి పాటుపడతామంటూ ప్రతిన బూనడంతో సహా అధికార భాషా సంఘం(తెలుగు) ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటిస్తామని కూడా స్పష్టం చేశారు....