శంఖుస్థాపన పనులు వేవగవంతం చేయాలి..
Ens Balu
5
Aalamuru
2021-06-01 13:50:58
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించే గృహ నిర్మాణాలకు శంకుస్దాపన చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టరు డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఆలమూరు గ్రామంలో ఎర్రకాలనీ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఆదేవిధంగా ఈ నెల మూడవ తేదీ శంకుస్దాపన కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని హంగులతో ఉన్న కొత్తపేట నియోజకవర్దం ఆలమూరు ఎర్రకాలనిలోని 7 ఎకరాల ప్రభుత్వ లేఅవుట్‌ను మోడల్ కాలనీగా రూపుదిద్దేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల శంకుస్దాపనకు ఆలమూరు గ్రామంలోని ఎర్రకాలనీ అనువుగా వుందని గుర్తించిందన్నారు. ఈ మేరకు శంకుస్దాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రచించి అందుకు అనుగుణంగానే ముందస్తు చర్యలకు జిల్లా యంత్రాంగం దృష్టిసారించిందన్నారు. ఇంటి స్దలం పొందిన లబ్దిదారులతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ముఖాముఖి స్పందన కార్యక్రమం దూరదృశ్య సమావేశం ద్వారా వుంటుదదన్నారు. పాత భూసేకరణ ప్రకారం 7 ఎకరాలు ప్రభుత్వ స్దలాన్ని సుమారు 304 మంది లభిదారులకుగాను పట్టాలు 2004 సంవత్సరంలో అందించారని అంతుముందుకు ఈ ప్రభుత్వ స్దలాన్ని ఆక్రమించుకొని లబ్దిదారులు పాకలు వేసుకుని జీవించేవారని వారికే పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు.ఈ స్దలాలను అభివృద్ది పర్చి రహదారులు, పార్కులను విభజించడం జరిగిందన్నారు. తదుపరి ఇటీవల నవరత్నాలు పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో మరో 15 ఎకరాలు భూసేకరణ ద్వారా సేకరించామన్నారు. నవరత్నాలు కార్యక్రమం సర్వేలో 7 ఏకరాలుకు సంబందించి పట్టాలు పొందిన లబ్దిదారులు ఇండ్లు నిర్మాణాలు గత 12 సంవత్సరాలు జరిగివుండలేదని గుర్తించడం జరిగిందని డ్వాక్రా పొదుపు సంఘాలు స్త్రీనిది వి.ఓ నిదులు ఇతరత్రా పెట్టుబడి నిదులు స్దానిక లబ్దిదారులు సేకరించుకొని గృహనిర్మాణాలు చేపట్టి పూర్తి చేసేలా జిల్లాయంత్రాంగల చర్యలు చేపట్టిందన్నారు. కాలనీలో చాలవరకు గృహనిర్మాణాలకు అనువుగా విద్యుత్ కనెక్షన్లు సరఫరాకు చర్యలు తీసుకోవాలని ట్రాన్పుకో ఎస్.ఇ టివిఎస్‌ఎన్‌మూర్తిని ఆదేశించారు. అదేవిధంగా అంతర్దత రోడ్లు, సి.సి.రోడ్లు. డ్రైయిన్యుల నిర్మాణానికి అంచనాలు రూపోందించాలని పంచాయితీ రాజ్ ఎస్ ఇ. నాగరాజును ఆదేశించారు లబ్దిదారులు అభ్యర్దన మేరకు జియోట్యాగింగ్ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని అదికారులను ఆదేశించారు. ప్రతి ప్లాట్‌లో ప్లాటు నెంబరు లబ్దిదారులు పేరు వివరాలుతో చిన్నబోర్డులు ప్రదర్శింపజేసి చూడగానే ఫలానా వారి స్దలం అని తెలియాలన్నారు. గ్రామీణ త్రాగునీటి సరఫరా మరియు పారిశుద్ద్యశాఖ వారు ఇంటింటికి కుళాయి ఏర్పాటు 105 లక్షలతో అంచనాలతో రూపొందించామన్నారు. గ్రామీణ త్రాగునీటి సరఫరా విభాగం వారి ఆప్షను ప్రకారం విద్యుత్ సౌకర్యాలు కల్సనకు పరిపాలన నిధులనుంచి రూ 21 లక్షలు వెంటనే చెల్లించాలని ఆయన ఆదేశించారు. స్దానికంగా గృహ నిర్మాణ పధకాన్ని విజయవంతం చేయాలని ఆయన అధికారులును ఆదేశించారు. మెటిరియల్ ప్లాట్ల వద్ద దిగుమతి చేయాలని 3వ తేదీన లబ్దిదారులు వారి మతాచారాల ప్రకారం శంకుస్దాపన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేసారు.నవరత్నాలు అమలులో భాగంగా లేఅవుట్లలో ఈనెల మూడవ తేదీన జగన్మోహనరెడ్డి చేతులుగా మీదుగా వర్చువల్ విధానములో భూమిపూజ మరిము శంకుస్దాపన చేస్తారన్నారు. భూమి పూజ మరియు శంకుస్దాపన కార్యక్రమానికి కరోనా నేపధ్యంతో లబ్దిదారులు మాత్రమే హాజరుకావాలన్నారు.