అనాధలకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా..


Ens Balu
3
Anantapur
2021-06-01 13:57:24

కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర  రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు ఎం శంకర్ నారాయణ  పేర్కొన్నారు మంగళవారం స్థానిక సూపర్ స్పెషాలిటీ  వద్ద  తాత్కాలిక ఆస్పత్రివి ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రివర్యులు పాల్గొని అనంతరం    కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన వారి 5 చిన్నారులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ. 50 లక్షల రూపాయల పరిహార ధ్రువీకరణ  పత్రాలను  మంత్రివర్యులు చేతుల మీదుగా   చిన్నారులకు పంపిణీ చేశారు. ఐ సి డి ఎస్, బాలల సంరక్షణ సమితి సమితి ఆధ్వర్యంలో  గుర్తించారు. అనంతపురం పట్టణానికి చెందిన కుమారి సత్య నాగ , విడపనకల్లు  సి హేమంత్, గార్లదిన్నె మండలం నికి చెందిన రాఘవేంద్ర, ధర్మవరం పట్టణానికి చెందిన జేమ్స్ బాండ్, పామిడి మండలానికి చెందిన బి.  దీపికలకు బాండ్లను అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్,జిల్లా క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకటారామిరెడ్డి ,నగర మేయర్ మహమ్మద్ వసిమ్,జాయింట్ క‌లెక్ట‌ర్లు,నిశాంత్ కుమార్,డా. ఏ.సిరి,   ఐసిడిఎస్ పీడీ  విజయలక్ష్మి, బాలల సంరక్షణ అధికారి సుబ్రహ్మణ్యం,   ఇతర అధికారులు తదితరులు  పాల్గొన్నారు.
సిఫార్సు