ఉద్యాన పంటలతో గిరిజనుల అభివ్రుద్ధి..
Ens Balu
4
Pachipenta
2021-06-01 14:39:02
ఉద్యానవన పంటలతో గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పార్వతీపురం ఐటిడిఏ పీఓ కూర్మనాథ్ అన్నారు. మంగళవారం ఈ మేరకు విజయనగరం జిల్లాలోని పాచిపెంట మండలం పాంచాలి గ్రామ పంచాయతీ జిలుగువలస గ్రామం పెదకొండలో గల ఆర్. ఓ.ఎఫ్.ఆర్ భూములను ఆయన పరిశీలించారు. అనంతరం ఎం.జి.ఎన్.ఆర్. ఇ.జి.ఎస్, ఉద్యానవన శాఖ చేపడుతున్న పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టాలు పొందిన లబ్ధిదారులు అందరికి ఉద్యానవన పంటలు పండించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండలంలో మండల స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, పి. ఎ లు, ఎ.పి. ఓ లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యానవన సహాయకులు ప్రణాళికలు రూపొందించుకొని ప్రతి లబ్ధి దారునికి లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో పాచి పెంట మండలం రెవెన్యూ, ఉద్యానవన ఆధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.