అయిన వారివే ఆ అనాధ శవాలు..


Ens Balu
3
Visakhapatnam
2021-06-02 03:10:24

ఉన్నోళ్లంతా మంచోళ్లు.. పోయినోళ్లు ఉన్నోళ్లకి తీపి గురుతులు.. ఇది ఒకప్పటి మాట.. ఉన్నోళ్లే మనవారు.. పోయిన వారంతా అనాధలు.. ఇదినేటి మాట.. అవును ఆ అయిన వారిని కరోనా కాటేస్తుంటే.. ఆ..క్షణం వరకూ ఆర్తనాదాలు చేసినవారే.. దవాఖానాల్లో వారిని అనాధ శవాలుగా వదిలిపోతున్నారు.. కరోనా చేస్తున్న కరాళ న్రుత్యానికి బలైపోయిన వారిని కడసారి చూసుకోవడానికి వీలుపడక.. ఇంటికి తీసుకెళ్లలేక అక్కడే వదిలేస్తున్నారు..  మరికొందరు ఆ వైరస్ మహమ్మారి ఇంకెంతమందని పొట్టపెట్టుకుంటుందోనని ఆ పార్ధీవ శరీరాన్ని తీసుకెళ్తూనే మార్గమధ్యలోనే దింపేస్తున్నారు.. అయినావరే ఎరుక లేక వదిలించుకుంటుంటే..కాటికాపరే వారికి కుటుంబ సభ్యుడవుతున్నాడు.. పీనుగను బూడిద చేసి మొక్క మొదటన పోస్తున్నాడు.. ఆత్మీయులు అనాధ శవాలుగా మారుతున్నా గుండెలవిసేలా రోధించి గుండెలు బాదుకుంటున్నారు  అయినవారంతా.. బహుసా వారి ఆత్మశాంతించదేమో..!
సిఫార్సు