కాలనీ పనుల లక్ష్యాలను అదిగమించాలి..


Ens Balu
3
పి.గన్నవరం
2021-06-04 15:56:41

వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్ పనులను లక్ష్యాలకు అనుగుణంగా  సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం డివిజన్ లోని పి.గన్నవరం గ్రామంలో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పంపిణీ చేసిన లేఅవుట్ అభివృద్ధి పనులను సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగులో ఉన్న లేఅవుట్ చదును పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లెవెలింగ్ అనంతరం గృహ నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టాలని అన్నారు. లేఅవుట్ చదును పనులకు మట్టి కొరతను తీర్చేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయడం జరిగిందని, మట్టిని అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా త్వరితగతిన గృహ నిర్మాణాలు పూర్తి చేసేందుకు రెండు వారాల్లో పూర్తి స్థాయిలో లేఅవుట్ లను సిద్ధం చేయాలని జెసి అధికారులకు సూచించారు.
సిఫార్సు