శంఖవరంలో 19 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు. శనివారం శంఖవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 50 మందికి ర్యాపిడ్ కరోనా పరీక్షలు నిర్వహించగా అందలో 17 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. మండల కేంద్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖచ్చితంగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ఎవరికి కోవిడ్ లక్షణాలు ఉన్నా తక్షణమే పీహెచ్సీలో పరీక్షలు చేయించుకొని ప్రభుత్వం ఇచ్చే కరోనా మందుల కిట్ ను హోమ్ ఐసోలేషన్ లో ఉండి వాడాలన్నారు. నిత్యం చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ బలవర్తక ఆహారం తీసుకోవడం ద్వారా 14 రోజుల్లో కరోనా వైరస్ భారి నుంచి బయట పడటానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ సమయంలో ఎవరికైనా శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు వుంటే తక్షణమే 104కి కాల్ చేయడం ద్వారా వారికి వారిని హాస్పటల్ ఐసోలేషన్ కి తరలిస్తారని డా.ఆర్వీవీ సత్యన్నారాయణ వివరించారు.