రెండు లేయర్ల మాస్కుల ధారణ శ్రేయస్కరం..
Ens Balu
2
Sankhavaram
2021-06-07 05:24:42
కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న తరుణంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు రెండు లేయర్లు ఉన్న నాణ్యమైన మాస్కులు ధరించడం ద్వారా కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం వుంటుందనే ప్రభుత్వ సూచనను పాటించాలని సిడిపీఓ బి.ఊర్మిళ సూచిస్తున్నారు. సోమవారం ఈ మేరకు శంఖవరంలో ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. అంగన్వాడీలు ఎప్పటికప్పుడు గర్భిణీస్త్రీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్య విషయంలో తల్లులకు కరోనా వైరస్ పైట్ల జాగ్రత్తలు చెబుతూ అప్రమత్తం చేయాలన్నారు. ఖచ్చితంగా బౌతిక దూరం పాటిస్తూ, ఎల్లప్పుడూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఏ పనిచేసినా చేతులను సబ్బుతో కడుక్కోవడంతోపాటు, నాణ్యమైన శానిటైజర్లను వినియోగించడం ద్వారా చేతులకు తెలియకుండా అంటే వైరస్ ను నాశనం చేయడానికి అవకాశం వుంటుందనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు బయటకు రావొద్దని, ఏ అవసరం వున్నా అంగన్వాడీల సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలు ఎక్కడా గుంపులు గుంపులుగా చేరి సమావేశాలు పెట్టుకోకూడదన్నారు. ప్రజలు ప్రభుత్వానికి స్వచ్చందంగా సహకరిస్తే అనుకున్న సమయం కంటే ముందుగానే కరోనా వైరస్ ను నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని ఊర్మిళ సూచిస్తున్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని, నిత్యం వేడి నీరు తీసుకుంటూ, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.