నిరుపేదలను కష్టకాలంలో ఆదుకునేది సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాత్రమేనని వ్యవసాయశాఖామంత్రి కురసాల కన్నబాబు అన్నారు రమణయ్యపేటలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని 41 మంది అనారోగ్య బాధితులకు రూ.32,06,500 మేర ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతోమందికి ఆపద సమయంలో ఆసరాగా నిలుస్తోందని, ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ నిధి గొప్ప భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా వీలైనంత ఎక్కువ మందికి లబ్ధిచేకూరేలా కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు అందుతున్న అర్జీలను తక్షణమే పరిష్కరించి, సహాయం అందించేందుకు సీఎంఆర్ఎఫ్‌కు సిఫార్సు చేసేందుకు పటిష్ట యంత్రాంగం రాష్ట్రంలో పనిచేస్తోందని మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.