బలవర్థక ఆహారంతో మెరుగైన ఆరోగ్యం..
Ens Balu
2
Tuni
2021-06-07 13:19:47
ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు ఇచ్చే పోర్టిఫైడ్ బియ్యాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తుని మున్సిపల్ చైర్ పర్శన్ సుధ పిలుపునిచ్చారు. సోమవారం కోటనందూరు లోని అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ పద్మావతితో కలిసి వీటిని గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేశారు. ఈ సంరద్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తుందన్నారు. అంతేకాకుండా గర్భిణీలకు పౌష్టికాహారాన్ని కూడా అందజేస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే సరుకులన్నీ ఖచ్చితంగా వినియోగించి గర్భిణీలు, చిన్నపిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. సీడిపీఓ పద్మావతి మాట్లాడుతూ, అమ్మ కడుపులో బిడ్డ తయారయ్యే సమయంలోనే ఆరోగ్యంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం వీటిని ప్రత్యేకంగా అందిస్తుందన్నారు. వీటితోపాటు పాలు, ఖర్చూరం, పల్లీ చిక్కీ, రాగిమాల్డ్, కోడిగ్రుడ్లను అందజేస్తున్నామన్నారు. అదే సమయంలో కరోనా వైరస్ ను ద్రుష్టిలో పెట్టుకొని తల్లులు, పిల్లలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేసిన సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో సర్పంచ్ శ్రీను, మహిళా పోలీసులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.