తూ.గో.జి లో జీతాల్లేక పారామెడికల్ సిబ్బంది ఆకలి కేకలు
                
                
                
                
                
                
                    
                    
                        
                             
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
East Godavari
                            2020-08-31 19:23:48
                        
                     
                    
                 
                
                    తూర్పుగోదావరి జిల్లా వైద్యఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రాలేదు. దీంతో కరోనా సమయంలో అప్పులు చేసుకొని బ్రతకాల్సి వస్తుందని సిబ్బంది వాపోతున్నారు. వాస్తవానికి వీరికి ఆరు నెలల ముందు వరకూ ప్రతీనెలా జీతాలు వచ్చేవి. కాని గత మూడు నెలల నుంచి వీరికి జీతాలు లేకపోవడంతో వీరి బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్రంగా మధన పడుతున్నారు. అందులోనూ తమ జీతాల సమస్య బయటకు తెలిస్తే ఎవరిపై ఏ రకమైన వేదింపుల కేసులు పెడతారోనని ఉద్యోగులంతా భయపడిపోతున్నారు. అయిన్నప్పటికీ ఈ విషయం బయటకి పొక్కింది. కరోనా వైరస్ తూర్పు గోదావరిజిల్లాలో కరోనా తన ప్రతాపం తీవ్రంగా చూపిస్తున్న సమయంలో పారామెడికల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కోవిడ్ పరీక్షలు చేస్తే అక్కడికి వెళ్లి తమ డ్యూటీలు చేయాల్సి వస్తుంది. గతంలో బస్సులు చాలాఎక్కువగా తిరిగేవని, టైముకి విధులకు రావడానికి అవకాశం వుండేదని, ఇపుడు ఎలాంటి వాహనాలు లేకపోవడం వలన అప్పులు చేసుకొని మరీ వాహనాలు కొనుక్కొని విధులకు, టైముకి హాజరవుతున్నట్టు కొందరు మహిళా పారామెడికల్ సిబ్బంది చెబుతున్నారు. తమ జీతాల విషయమై జిల్లా కార్యాలయంలో అడిగితే అదిగో ఇదిగో అని కాలయాపన చేస్తున్నారని పారామెడికల్ సిబ్బంది వావపోతున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రభుత్వం అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగానే తమకు ప్రతీనెలా సమాయానికి జీతాలు ఇచ్చేలా చేయాలని వీరు కోరుతున్నారు.