నవజాత శిశువుల ఆరోగ్యం కోసం 108సేవలు


Ens Balu
2
పాడేరు
2020-08-31 13:34:39

విశాఖ ఏజెన్సీలోని నవజాత శిశువులకు నిరంతరం వైద్యం అందించి శిశుమరణాలు నివారించాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల అధికాకులను ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో  108 అత్యవసర సేవల  గోడపత్రికను  ఆర్ డిఓ కె.లక్షి శివజ్యోతి తో కలిసి లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో కాల్ అందిన వెంటనే సమస్య తీవ్రతను బట్టి ఆసుపత్రికి తరలించాలని సూచించారు. 108 కు కాల్ వచ్చిన వెంటనే స్పందించి వైద్యం అందేవిధంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. విశాఖ ఏజెన్సీలో ఈ సర్వీసులు పూర్తిస్థాయిలో అందుతున్నాయనే భావన, అత్యవసర సేవలకు, ఆపద సమయంలో 108 వాహనాలు ఎంతో ఉపయోగ పడుతున్నాయనే భరోసా గిరిజనులకు కలగాలన్నారు. అదేసమయంలో శిశు మరణాలు సంభవించకుండా పారామెడికల్ సిబ్బంది డెలివరీ అయిన దగ్గర నుంచి తల్లీ బిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, అత్యసర సమయాల్లో 108 సేవలు ఎలా సద్వినియోగం చేసుకోవాలో అవగాహన కలిగించాలన్నారు. దానికోసం గిరిజనులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి  సేవాలందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 108 ఆపరేషన్  ఎక్సిక్యూటివ్ రంజిత్ కుమార్,  ఈఏంటి  శ్రీనివాస్, భవాని తదితరులు పాల్గొన్నారు.