సంక్షేమానికి చిరునామా సీఎం వైఎస్ జగన్..
Ens Balu
4
Ongole
2021-06-08 13:19:31
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎంతో పారదర్శకంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మంగళవారం యర్రగొండపాలెంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాడి రెండేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను జవాబు దరితనముతో ఆమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా ఆమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబుల్, ఖురాన్ ,భగవద్గీతగా ముఖ్యమంత్రి తలచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రజలకు ఎన్నికల్లో చెప్పినదాని కంటే పది రేట్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్ట్ ను వేగవంతం గా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మార్కాపురం లో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం చర్యలు చేపట్టామాన్నారు. దోర్నాల లో గిరిజనుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ,మాతా శిశు వైద్య శాల ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండ పాలేం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఒంగోలు మూర్తి రెడ్డి, దొంతా కిరణ్ గౌడ్, వై.సి.పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.