11.30వరకూ సత్యదేవుని దర్శనాలు..


Ens Balu
3
Annavaram
2021-06-10 14:21:51

అన్నవం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో రేపటి నుంచి ఉదయం 6గంటల నుంచి 11.30 గంటల వరకూ స్వామి దర్శనాలకు అనుమతి లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, మురళీధరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వామి దర్శనాలతోపాటుుు కేశ ఖండన శాల కూడా పనిచేస్తుందన్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి దర్శనాలు చేసుకోవచ్చునన్నారు. శ్రీ స్వామివారి ఆర్జిత సేవల వ్రతములు, కల్యాణములు మొదలగు యధావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.
సిఫార్సు