క్రిష్ణ మెడికల్ సెంటర్ స్టాపర్స్ వితరణ..


Ens Balu
5
Razam
2021-06-11 12:20:27

రాజాం నగర పంచాయతీలో రోజు రోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు, అలాగే కోవిడ్ కర్ఫ్యూ సమయంలోనూ కృష్ణా మెడికల్ సెంటర్ అందించిన ట్రాఫిక్ స్టాపర్స్ పోలీసులకు కు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయని రాజాం సీఐ పి.శ్రీనివాసరావు  చెప్పారు.  
వైఎస్ఆర్సీపీ యువనేత, రేడియాలజిస్ట్, డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య సారధ్యంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో శ్రీకాకుళం, విశాఖలో సేవలందిస్తున్న కృష్ణా మెడికల్ సెంటర్ (కేఎంసీ) ద్వారా శుక్రవారం సాయంత్రం రాజాం పోలీసు స్టేషన్ కు స్టీల్ స్టాపర్స్ డివైడర్స్ని బహుకరించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద (సీఎస్ఆర్ నిధులతో) పటిష్ఠమైన విశాఖ స్టీల్ తో తయారు చేసిన ఈ డివైడర్లపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, సెల్ఫోన్లో మాట్లాడుతూ. డ్రైవింగ్ చేయడం నేరం.. అతివేగం అనర్ధదాయకం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. తదితర నినాదాలను రాయించారు. రాజాం ప్రధాన కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణామెడికల్ సెంటర్ సీఇఓ ఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ వి శరత్ చంద్, ఎం చంద్రశేఖరరావు (చందు), కృష్ణా మెడికల్ సెంటర్ సిబ్బంది తెలుగు తరుణ్, కె బలరాం, సూరపు జయరామ్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు