BMSఆంధ్ర రాష్ట్ర నూతన కార్యవర్గమిదే..
Ens Balu
4
Guntur
2021-06-13 15:09:33
భారతీయ మజ్దూర్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ 3వ రాష్ట్రకార్యవర్గాన్ని బిఎంఎస్ సౌత్ జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దురైరాజు ఆదివారం జూమ్ ద్వారా నిర్వహించిన 3వ రాష్ట్ర మహా సభల సందర్భంగా ప్రకటించారు. ఏపీ అధ్యక్షుడిగా ఎం.శ్రావణ్ కుమార్(గుంటూరు), ఉపాధ్యక్షులుగా ఖాధర్ భాషా(నెల్లూరు), ఉన్ని క్రిష్ణ(తూర్పుగోదావరి), పద్మావతి(అనంతపురం), జనరల్ సెక్రటరీగా ఎంవీఎస్ నాయుడు(విశాఖపట్నం), డిప్యూటీ జనరల్ సెక్రటరీగా బి.రమేష్(కడప), కార్యదర్శిలుగా మహేష్ సింగ్(పశ్చిమగోదావరి), సుబ్రమణ్యంరెడ్డి(తిరుపతి), కొల్లా భవాని(గుంటూరు),అద్దంకి సాంభశివరావు(క్రిష్ణాజిల్లా), ట్రజరర్ గా ఎల్.ప్రసాద్(విశాఖపట్నం), మరో 13 మంది సభ్యులతో కొత్త కార్యవర్గాన్ని నియమించినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త రాష్ట్ర కార్యవర్గ మంతా జాతీయ కార్యవర్గానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు జరిగిన మహాసభలో బిఎంఎస్ చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసి వారి అభివ్రుద్ధికి తోడ్పాటునందించాలని కార్యవర్గం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో బిఎంఎస్,బిటిఈయూ నేషనల్ ప్రెసిడెంట్ వివిఎస్ సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.