18తులాల బంగారం, 4తులాల వెండి కొట్టేశారు...
Ens Balu
3
Ravikamatham
2020-08-31 19:35:19
రావికమతంలో భారీచోరీ జరిగింది. ఆదివారం అర్థరాత్రి సమయంలో మెయిన్‌రోడ్డులోని వ్యాపారి దాచేపల్లి లోవరాజు పెయింటింగ్ షాపులోని ఐరన్ లాకర్‌లో భద్రప రిచిన సుమారు రూ.13.20లక్షల విలువచేసే 18తులాల బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండిని దొంగలు ఎత్తుకుపోయారు. మెయిన్‌రోడ్డు వైపుగల ఇనుపు షట్టర్‌ను మధ్యలోకి వంచి దాంట్లోంచి లోనికి చొరబడి ఈ చోరీకి పాల్పడ్డారు. ఈ విషయమై పోలీసులకు భాదితుడు దాచేపల్లి రామారావు ఫిర్యాదు చేయడంతో రావికమతం ఎస్‌ఐ చంద్రశేఖర్ విచారణ చేపట్టారు. ఈ షాపులో అమర్చిన సీసీ కెమెరాలు 2 నెలల క్రితం పాడవడంతో వాటిని బాగు చేయకుండా వదిలేయడంతో చోరీకి సంబం ధించిన ఎలాంటి వీడియోలు చిత్రీకరణ జరగలేదని ఎస్ఐ చెప్పారు. విశాఖ నుంచి వచ్చిన క్లూస్ టీము చోరీకి గురైన షాపులో వేలిముద్రలు సేకరించారు. పెయిం టింగ్ షాపులోకి ఇనుప లాకర్‌లో భద్రపరిచిన 18తులాల బంగారు ఆభరణాలు నాలుగు కేజీల వెండిని దొంగిలించుకుపోయారని వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.