రవాణాశాఖ కార్యాలయానికి అనువైన భూములను గుర్తిస్తున్నట్టు జెసి లక్ష్మీషా తెలియజేశారు. మంగళవారం శంఖవరం మండల కేంద్రంలో ఆర్టీఓ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ యార్డు గిడ్డంగి భవనాల నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రభుత్వ ఖాళీ స్ధలాలను ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, రెవిన్యూ అధికారులతో కలిసి జెసి పరిశీలించారు. ఇందుకోసం శంఖవరంలోని అరుంధతీయ కాలనీకి, వాణీనవ దుర్గాదేవి ఆలయానికీ మధ్య ఉన్న ప్రభుత్వ ఖాళీ భూమిలో నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ జెసికి ప్రతిపాదించారు. ఈభూమిని గతంలోనే
గతంలోనే దేవాదాయ ధర్మాదాయశాఖ నుంచి రెవెన్యూ శాఖ కొనుగోలు చేసినట్టు జెసికి ఎమ్మెల్యే వివరించారు. అంతేకాకుండా ఈ రెండు తరహా భూముల్లోనూ ఆయా శాఖల భవనాల నిర్మాణానికి నిర్ణయిస్తూ గతంలోనే తహశీల్దార్ ప్రభుత్వికి ప్రతిపాదనలు కూడా పంపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆర్డీఓ మల్లిబాబు, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీఓ రాంబాబు, సర్వేయర్ సురేష్, వీఆర్వో సీతారాం తదితరులు పాల్గొన్నారు.