సెప్టెంబరు 1 నుంచి లాక్ డౌన్ సడలింపులు...
Ens Balu
4
నర్సీపట్నం
2020-08-31 21:06:23
నర్సీపట్నంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి పాక్షిక లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేస్తున్నట్టు సబ్‌కలెక్టర్ నారపురెడ్డి మౌర్య చెప్పారు. సోమవారం సబ్‌కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వర్తక సంఘ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోవిడ్ నియంత్రణకు సంబంధించి తీసుకునే చర్యలపై కూలంకుషంగా చర్చించారు. అనంతరం సబ్‌కలెక్టర్ మౌర్య మాట్లాడుతూ సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి రాత్రి 7గంటల వరకు షాపులు తెరిచి వుంచుకోవచ్చని స్పష్టం చేశారు. ఇంతవరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి వుంచాలని అనంతరం లాక్‌డౌన్ నిబంధనలు వర్తించేవన్నారు. ప్రస్తుతం ఆ నిబంధనలు ఎత్తివేస్తూ రాత్రి 7గంటల వరకు షాపులు తెరిచి వుంచుకోవచ్చని అధికారులను ఆదేశించేశారు. ఈ విషయం ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు. అదే సమయంలో సామాజికి దూరం, మాస్కుల ధారణ తప్పని సరిగా పాటించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సీఐ స్వామినాయుడు, మున్సిపల్ కమిషనర్ కనకారావు, వర్తక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.