తాండవ నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలి...


Ens Balu
3
నర్సీపట్నం
2020-08-31 21:07:47

తాండవ నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌ ‌కార్యాలయం ఎదుట గొలుగొండ మండలం గాదంపాలెం నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ, తాండవ నిర్వాసితులకు మా గ్రామంలో మిగులు భూమి ఇవ్వడం జరిగిందని విప్పలపాలెం గ్రామానికి చెందిన దొరలు ఆక్రమించుకుని వ్యవసాయం చేసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే పాకలపాడు గ్రామంలో దళితులకు చెందిన స్మశాన వాటిక స్థలంలో ప్రభుత్వ కట్టడాలను నిర్మిస్తూ గ్రామ దళితులుకి అన్యాం చేస్తుందని అన్నారు.   ప్రభుత్వం తక్షణమే ఆక్రమణ దారుల నుంచి భూములను విడిపించి నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  అనంతరం సబ్‌కలెక్టర్‌ ‌మౌర్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల సీపీఐ నాయకులు బాలేపల్లి వెంకటరమణ, మాకిరెడ్డి రామునాయుడు,మేక సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.