ఆక్వాహబ్ ల ఏర్పాటుకి ఆహ్వానం..
Ens Balu
5
Vizianagaram
2021-06-17 08:45:49
మత్స్య ఉత్పత్తి, స్థానిక తలసరి వినియోగాన్ని మరింత పెంచే లక్ష్యంతో ఆక్వాహబ్ ల ఏర్పాటుకి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. గురువారం ఈ మేరకు తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆన్ లైన్ ఉత్పత్తులు మాదిరిగానే ఇపుడు మత్స్య ఉత్పత్తులను కూడా ఆన్ లైన్ ద్వారా డోర్ డెలివరీ చేసే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించిందని పేర్కొన్నారు. దీనికోసం రిటేల్ ఔట్ లెట్లు, ఫిష్ కియోస్క్, ఆక్వాహబ్, లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్ల ను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఆన్ లైన్ లో https://ematsyakar.com/efisher/retailunits ను సందర్శించి కూడా దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. అటు వీటికి సంబంధించిన దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. మరిన్ని వివరాలకు apfishdomesticmktg@gmail.com లోగానీ,8247586549, 9908603882లో గాని సంప్రదించాలని మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మల కుమారి కోరుతున్నారు.